మార్కెట్‌లో స్థలంపై హెచ్చరికలు జారీ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో స్థలంపై హెచ్చరికలు జారీ

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఎకరం రూ.3కోట్ల డీల్‌’ శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో ఉన్న రూ.కోట్ల విలువైన సర్కారు పోరంబోకు భూమిపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశాల మేరకు మంచిర్యాల తహసీల్దార్‌ రఫతుల్లా సర్వే నంబరు 87చుట్టూ ఉన్న రేకుల షీట్స్‌కు రెండు వైపుల చట్టపరంగా హెచ్చరికలు ఏర్పాటు చేశారు. ‘ఈ స్థలం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ విచారణలో ఉందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి నిర్మాణాలు, భౌతిక స్థితి మార్చడం నేరం. ఉల్లంఘించిన యెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరికల్లో కలెక్టర్‌ పేరుతో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement