ఉత్తర్వులు ఇచ్చారు.. తరలింపు ఆపారు..! | - | Sakshi
Sakshi News home page

ఉత్తర్వులు ఇచ్చారు.. తరలింపు ఆపారు..!

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

● మైనార్టీ స్కూల్‌, కళాశాలలో అసౌకర్యాలు ● ఇబ్బందుల్లో విద్యార్థులు ● తరలింపు అమలులో జాప్యం

చెన్నూర్‌: చెన్నూర్‌ మైనార్టీ పాఠశాల, కళాశాలలో అసౌకర్యాలతో విద్యార్థులు సతమతం అవుతున్నారు. ఈ విషయం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి పాఠశాలను సందర్శించారు. గదులు, డ్రెయినేజీ వ్యవస్థ, మురుగునీరు లీకేజీలు పరిశీలించారు. పాఠశాల, కళాశాలను ఇక్కడి నుంచి తరలిస్తామని ప్రకటించారు. మంత్రి ఆదేశాల మేరకు మైనార్టీ పాఠశాల, కళాశాలను మందమర్రిలోని సింగరేణి మహిళా పీజీ కళాశాలకు మార్చాలని మే 14న మైనార్టీ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి షఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలలు కావస్తున్నా ఉత్తర్వులు అమలు కాకపోవడంలో ఆంతర్యమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

అసౌకర్యాలతో అవస్థలు

ఇరుకు గదులు, డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో అడ్మిషన్లపై ప్రభావం పడుతోంది. తరగతి గదుల్లో గాలి, వెలుతురు సరిగా లేకపోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆటస్థలం లేకపోవడం, మురుగునీరు తరగతి గదుల్లో లీకేజీ కావడం, దుర్వాసన వెదజల్లడం, అపరిశుభ్రత వాతారణం, అభద్రతపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా మందమర్రి మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇక్కడి నుంచి తరలించొద్దని కొందరు స్థానిక నాయకులు అడ్డుకున్నట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా అధికారులు నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తరలింపుపై మైనార్టీ స్కూల్స్‌ డీడబ్ల్యూవో రాజేశ్వరి స్పందిస్తూ మందమర్రికి తరలించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయని, కొన్ని రోజులు ఆగాలని రాష్ట్ర కార్యదర్శి చెప్పడంతో నిలిపి వేశామని తెలిపారు. మళ్లీ రాష్ట్ర కార్యదర్శి ఆదేశాలు ఇస్తే తరలిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement