గోదావరిఖని: జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో స త్తా చాటి సింగరేణి పేరుప్రతిష్టలు నిలపాలని ప్రా జెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. గురువారం ఆర్జీటూ ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను సందర్శించి, శిక్షణ పొందుతున్న మూడు రెస్క్యూ టీంలతో సమావేశం అయ్యారు. శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంత త, రెస్క్యూ పట్టు ఎంతో కీలకమన్నారు. అనంత రం సింగరేణి మహిళా రెస్క్యూ టీమ్ నిర్వహించిన రెస్క్యూ రిలే వ్యాయామ విన్యాసాలను తిలకించి అభినందించారు. ఒక మహిళ, రెండు పురుష జట్ల కెప్టెన్లు కృష్ణవేణి, ప్రమోద్, నితిన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్, ఆర్జీ–3 జీఎం మధుసూదన్, ఏపీఏ జీఎం నాగేశ్వర్రావు పాల్గొన్నారు.


