కాసిపేట: ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాల పరిరక్షణకు తోడ్పాటు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య తెలిపారు. బెల్లంపల్లి మండలం సోమగూడెం(బి) గ్రామపంచాయతీలో గురువారం ఇంకుడుగుంతల నిర్మాణాలకు భూమిపూజ చేసి ప్రారంభించారు. బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పర్వతాలు అనే వ్యక్తి ఇంటి అక్రమ బదలాయింపుపై గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ పొన్నాల మౌనిక, ఉపసర్పంచ్ ముత్తె విజయ, డీఎల్పీవో సతీష్‌కుమార్, ఎంపీడీవో మహేందర్, కార్యదర్శి ప్రసాద్, స్థానిక నాయకులు పొన్నాల కనకరాజు, ముత్తె భూమయ్య, రాకేష్, శ్యాంబాబు తదితరులున్నారు.


