మంచిర్యాలఅర్బన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ప్రతిష్టాత్మకమైన ఎన్సీసీ సెలక్షన్లో పాల్గొని వివిధ జాతీయ క్యాంపులకు అర్హత సాధించిన కేడెట్ల అభినందన సమావేశం నిర్వహించారు. ఎంపికై న ఆలిండియా ట్రెకింగ్ క్యాంపు (కేరళ)కు ఎంపికై న శ్రీజా, గుంటూరు ట్రెకింగ్ క్యాంపునకు నిమిత, శివాణి, స్రవంతి, అక్షిత, శ్రావ్యలను ప్రశంసా పత్రాలతో పాటు శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజా మాట్లాడుతూ.. విద్యార్థులు వివిధ జాతీయ స్థాయి క్యాంపులలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించటం కళాశాలకు ఎంతో గర్వకారణమన్నారు. మున్ముందు విద్యార్థులు మరిన్ని జాతీయ కార్యక్రమాల్లో పాల్గొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


