భీమారం: మండల కేంద్రం సమీపంలోని ఐటీడీఏ కాలనీలోని కొన్ని వీధుల్లో పగలు కూడా వీధిదీపాలు వెలుగుతున్నాయి. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు ఇస్తున్నా.. ఇక్కడ మాత్రం విద్యుత్ వృథా చేయడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని ఆన్‌ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జన్నారం: ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోతుండటంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. కడెం ప్రాజెక్టు నీటిని నిలిపివేయడం, ప్రస్తుతం విడుదల చేసిన చివరి ఆయకట్టు వరకు రాకపోయేసరికి వరి పంట ఎండిపోకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గంగరాజు తాను కౌలుకు చేసిన పొలానికి నీరు లేక ఎండిపోతున్న తరుణంలో కాపాడుకోవడం కోసం వేరే రైతు బావికి మోటర్ పెట్టుకొని నీటిని రోడ్డు దాటించి తన పొలానికి పారిస్తున్నాడు. ధర్మారం కలమడుగు గ్రామాల మధ్య గల పొలాలు కాపాడుకోవడం కోసం ఓ రైతు చెరువు నీరు ఆగిపోవడంతో చిన్న మడుగులో నీరు ఉండటంతో అందులో నీటిని విద్యుత్ మోటర్ అమర్చి తన పొలానికి పారిస్తున్నాడు.
ఎండిన మొక్కలు
భీమారం: మండల కేంద్రంలో గ్రామపంచాయ తీ ద్వారా గత సంవత్సరం ఏర్పాటు చేసిన మొక్కల నర్సరీలో మొక్కలు ఎండిపోగా వాటికి ఆనవాళ్లుగా ఖాళీ బ్యాగులు ఉండిపోయాయి. భీమారంలో 6వేల మొక్కలు నాటారు. సరైన సంరక్షణ బాధ్యతలు చేపట్టకపోవడంతో దాదా పు 1000మొక్కలు ఎండిపోయినట్లు తెలిసింది.
పంట కోసం పాట్లు


