నిందితులను శిక్షించేవరకు నిరసనలు | - | Sakshi
Sakshi News home page

నిందితులను శిక్షించేవరకు నిరసనలు

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

శ్రీరాంపూర్‌: ఇటీవల మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చింతగుంట గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని అఖిల భారతీయ వి శ్వకర్మ మహాసభ నాయకులు డిమాండ్‌ చేశారు. నస్పూర్‌ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాసచారి పాల్గొ ని మాట్లాడారు. విశ్వకర్మల ఆరాధ్య దైవమైన వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ధంసం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర కార్యదర్శి కర్ని కంటి నరసింహచారి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తేలికుంట్ల రాజాచారి, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కొండపర్తి రా మ్మోహన చారి, నాయకులు బీసీ సమాజ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరేడ్ల శ్రీనివాస్‌, నాయకులు మునిగంటి సత్యనారాయణ, ఎర్రోజు సాయిరాం, సుగుణాకర్‌, రాజమౌళి గురువయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement