మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని 39వ డివిజన్ చున్నంబట్టి వాడలో గల నాగదేవత కాలనీలో నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేపట్టనున్నట్లు గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 14న గణపతిపూజ, పుణ్యహవచనం, పంచగవ్వప్రాశం, యుగశీల ప్రవేశం చేపట్టిన అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 15న పూజలు నిర్వహించి, 16న విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వేదపండితులు రా మగుండం రామ్‌శర్మ, 39వ డివిజన్ కార్పొరేటర్ పూదరి సునిత, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, 40వ డివిజన్ కార్పొరేటర్ ఆది శశికళ, సంజీవ్ పాల్గొన్నారు.


