ఉట్నూర్రూరల్: గొండ్వానా భూభాగంలో అత్యంత పవిత్రమైన ఎత్మసార్ ఉత్సవాలు, గుస్సాడి –పద్మల్పూరి కాకో దేవత పోస్టర్ను ఐటీడీఏ కార్యాలయంలో పీవో మంద మకరందు ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. నవంబర్ 5న పద్మల్పూరి కాకో దేవస్థానంలో ప్రత్యేక దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి 12 వరకు ఘనంగా గుస్సాడి –దండారి ఉత్సవాలు జరగనున్నాయన్నారు. ఈ పవిత్ర వేడుకలకు ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున హాజరు కావాలని వారు కోరారు. పద్మపూరి కాకో వైస్ చైర్మన్ కుమ్ర లింగారావు, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు, రాష్ట్ర నాయకులు తొడాసం భీంరావు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఆత్రం రాజేశ్వర్, రాజ్ విద్యార్థి సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఆత్రం భగవంత్ రావు, పెందోర్ శ్రీనివాస్, ఆదివాసీ సేన మండల అధ్యక్షులు ఆత్రం జలపాత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


