కడెం కాలువ కింద ఎకరం పొలం పండిస్తున్న. మరో నాలుగు తడులు ఇస్తే పంట చేతికొస్తుంది. ఇరిగేషన్ అధికారులు విడతల వారీగా నీరిస్తామని చెబుతున్నారు. ఇలా ఇవ్వడంతో ఇప్పటికే వరి పంట సగం ఎండింది. ఆపకుండా నీరిచ్చిఆదుకోవాలి.
– జక్కుల గౌరయ్య, కలమడుగు
జోన్లుగా విభజించి ఇస్తున్నాం
ఎల్‌నినో ప్రభావంతో కడెం ప్రాజెక్టులో నీరు తగ్గుతోంది. నీటి వృథాను అరికట్టేందుకు రెండు జోన్లుగా ఏర్పాటు చేసి నీరందిస్తున్నాం. 1 నుంచి 12డిస్ట్రిబ్యూటరీలు ఏ జోన్, 13నుంచి 20 డిస్ట్రిబ్యూటరీలు బీ జోన్‌గా విభజించాం. రైతులు నీరు వృథా చేయకుండా కాపాడుకోవాలి. పంట చేతికొచ్చే వరకు నీరందిస్తాం. – శ్రావణ్, ఇరిగేషన్ ఏఈ


