జనగణన స్పష్టంగా నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన స్పష్టంగా నమోదు చేయాలి

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జనాభా గణన కార్యక్రమంలో వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీపీవో పాపయ్య, డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సెస్‌(ఆపరేషన్‌) రాష్ట్ర కన్సల్టెంట్‌ కే.కృష్ణయ్య, మాస్టర్‌ ట్రైనర్‌ శరణ్యతో కలిసి జిల్లా అదనపు చార్జ్‌, మండల స్థాయి చార్జ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2వ దశలో జనాభా గణనను కచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. జనగణనకు సంబంధించి అన్ని అంశాలపై చార్జ్‌ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేటాయింపులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సమాచార సేకరణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రాజేందర్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు, మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత సమావేశంలో బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, బెల్లంపల్లి, జైపూర్‌ ఏసీపీలు, జాతీయ రహదారుల అధి కారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారి–363పై వాహనాల వేగం నియంత్రణకు స్పీడ్‌గన్‌లు ఏర్పాటు చేయాలని తెలి పారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయాలని, ఫిట్‌నెస్‌ లేని వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని, బీమా లేకుండా తిరిగే వాహనాలపై జరిమానాలు విధించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement