మంచిర్యాలరూరల్(హాజీపూర్): విపత్తుల వేళ ప్రాణ, ఆస్తి నష్టాల నివారణలో యువత పాత్ర చాలా కీలకమని గుడిపేట 13వ ప్రత్యే క పోలీసు బెటాలియన్ కమాండెంట్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం బెటాలియన్‌లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో కరీంగనర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన యువ ఆపదమిత్ర ప్రత్యేక శిక్షణను ఆయన ప్రారంభించారు. ప్రత్యేక శిక్షణ కిట్ బ్యాగులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముందస్తు రక్షణ చర్యలపై అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని తెలిపారు. వర్సి టీకి చెందిన 66 మంది బాలురు, 36 మంది బాలికలు శిక్షణలో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, అగ్నిప్రమాదా ల నియంత్రణ, లైఫ్ జాకెట్లు, బోట్ల వినియోగంలో మెలకువలు, భవనాలు కూలినప్పు డు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణ తదితర అంశాలపై ఎస్ డీఆర్‌ఎఫ్ మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు వీరరాజు, ఆంజనేయరెడ్డి, నాగభూషణం, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోశ్‌సింగ్, అడ్మినిస్ట్రేటీవ్ అధికారి గౌస్‌మొహీయుద్దీన్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఆర్‌ఐ ఎం.అశోక్ పాల్గొన్నారు.


