చెన్నూర్‌రూరల్: కుమ్మరి సారె కళ తప్పుతోంది. మట్టి పాత్రలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. ఫలితంగా వృత్తినే నమ్ముకున్న కుమ్మరులు ఉపాధికి దూరమవుతున్నారు. దీపావళి వచ్చిందంటే ఒకప్పుడు మట్టి ప్రమిదలకు డిమాండ్ ఉండేది. కుమ్మరుల ఇళ్లకు వచ్చి ప్రమిదల కోసం ఆర్డర్లు ఇచ్చేవా రు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వివిధ ఆకృతుల్లో రెడీమేడ్ మట్టి పాత్రలు, ప్రమిదలు దిగుమ తి అవుతుండగా కుమ్మరులకు కష్టాలు మొదలయ్యాయి. కుమ్మరులు తయారు చేసిన ప్రమిదలు డజన్‌కు రూ.40 మాత్రమే ధర పలుకుతుండగా రెడీమేడ్ ప్రమిదలు ఇంతకంటే తక్కువకే వస్తుండడంతో జనాలు వాటివైపే మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో 8వేల మంది కుమ్మరులుండగా, ఇందులో 2వేల మంది కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారు. కుండలు, ప్రమిదలు, వివిధ పాత్రలు తయారు చేసి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తా ము తయారు చేసిన మట్టి పాత్రలకు ఆదరణ తగ్గి ఉపాధికి దూరమవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


