రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం | - | Sakshi
Sakshi News home page

రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

మంచిర్యాలటౌన్‌: జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కొంత సమయం పడుతుందని, ఇటీవల కురిసిన వ ర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి వద్ద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. రాళ్లవాగుపై నూతన బ్రిడ్జి పనులను గురువారం ఆయన అధి కారులతో కలిసి పరిశీలించారు. రాళ్లవాగు కాజ్‌వే నుంచి ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించేలా వారం రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులకు సూచించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నగరానికి ఇదే సెంటర్‌ పాయింట్‌ అవుతుందని, ఆండాళమ్మ కాలనీ నుంచి వంద ఫీట్ల రోడ్డును కలిపేలా బ్రిడ్జి నిర్మాణం జరిగితే విశాలమైన రోడ్లు జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్‌ దర్ని మధుకర్‌, మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ తూముల నరేష్‌, జిల్లా ఆర్జీపీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement