దండేపల్లి: మండలంలోని తాళ్లపేట గ్రామంలో మంగళవారం జరిగి దాడి ఘటనలో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నలుగురిని అరెస్టు చేశారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి బుధవారం తన కార్యాలయంలో ఎస్సైలు రాజవర్ధన్, సురేష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. తాళ్లపేట గ్రామానికి చెందిన పేరం రజిత తన సోదరుడు ఆకుల రాజేంద్రప్రసాద్, మేనల్లుడు అకిరానందన్‌తో కలిసి మంగళవారం జమ్మీకి వెళ్లే క్రమంలో గ్రామానికి చెందిన ఆకుల కిరణ్, రాజేందర్, సురేష్, విజయ్‌వర్ధన్, ముత్తె కుమారస్వామి, ఎర్రం మల్లేష్ అక్రమంగా ఇంట్లోకి చొరబడి అసభ్య పదజాలంతో దూషించి కర్రలతో దాడి చేశారని తెలిపారు. రజిత, రాజేంద్రప్రసాద్, అకిరానందన్‌కు గాయాలయ్యాయని తెలిపారు. రజిత ఫిర్యాదు మేరకు ఆరుగురిపై దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకుల కిరణ్, సురేష్, విజయ్‌వర్ధన్, ఎర్రం మల్లేష్ బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


