మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని ప్రతిభ నర్సింగ్ హోంలో ఆదివారం రాత్రి గర్భిణి రుచిత మృతి చెందిన ఘటనపై మంగళవారం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ విచారణ చేపట్టారు. రుచితకు అందించిన వైద్య సేవలు, కేసు షీట్లను పరిశీలించారు. మృతికి గల కారణాలపై సమగ్ర నివేదిక తీసుకుని కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నమోదు చేసుకున్న జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు చట్టానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. ప్రతీ ఆస్పత్రిలో రెండు, మూడు చోట్ల వైద్యఖర్చుల చార్జీలను ప్రదర్శించాలని, స్పెషలిస్ట్ వైద్యులు, సిబ్బంది వివరాలూ ఉంచాలని తెలిపారు. ప్రతీ ఫార్మసీ కేంద్రంలో ఫార్మసిస్ట్ ద్వారానే మందులు అందించాలని ఆదేశించారు. ప్రతీ ల్యాబ్‌లో చేసే పరీక్షలు, వాటి వివరాలు డిస్‌ప్లే చేయాలని తెలిపారు. రోగులతో సమన్వయం చేసుకుని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి చికిత్స అందించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, వెంకటసాయి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్, వైద్యులు ప్రతిభ, రఘువంశీ పాల్గొన్నారు.


