పాతమంచిర్యాల: రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్ ధీమా వ్యక్తంజేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో ప్రధా ని మోదీ జన్మదినం సందర్భంగా సేవాసంకల్ప్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కంటివైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వైద్యశిబిరంలో 350 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వృద్ధాశ్రమం ఆనంద నిలయంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. శ్రీసాయి అంధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఆకుల అశోక్‌వర్ధన్, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్న తదితరులున్నారు.


