ఈ మున్సిపల్‌ కమిషనర్‌ మాకొద్దు | - | Sakshi
Sakshi News home page

ఈ మున్సిపల్‌ కమిషనర్‌ మాకొద్దు

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

● క్యాతనపల్లి బల్దియా కౌన్సిలర్ల ఆగ్రహం ● రసాభాసగా మున్సిపల్‌ సమావేశం

రామకృష్ణాపూర్‌: ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణను వెంటనే మా ర్చాలని క్యాతనపల్లి మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు తీర్మానించారు. తీర్మానం ప్రతిని సీడీఎంఏ, కలెక్టర్‌కు పంపిస్తామని చైర్‌పర్సన్‌ గొడిసెల సంధ్యారాణి, వైస్‌చైర్‌పర్సన్‌ మిట్టపెల్లి సరిత, బీఆర్‌ఎస్‌, సీపీఐ కౌన్సిల్‌ సభ్యులు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్‌ కా ర్యాలయంలో మంగళవారం ఉద యం 11.30 గంటలకు కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. చైర్‌పర్సన్‌ ముందుగా ఎజెండా అంశాన్ని ప్రస్తావించారు. చైర్‌పర్సన్‌, కౌన్సిల్‌ సభ్యులతో సంప్రదించి వార్డుల్లోని సమస్యలు, సభ్యుల సూచనలు, అవసరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎజెండా రూపొందించాల్సి ఉండగా.. కమిషనర్‌ ముందుగానే సిద్ధం చేసిన ఎజెండాను సమావేశంలోకి ఎలా తీసుకువస్తారంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సమావేశం నుంచి వారు ముందుగానే వాకౌట్‌ చేశారు.

ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహం

కౌన్సిల్‌ సభ్యులు కమిషనర్‌ తీరుపై మండిపడు తూ.. ఇప్పటికే ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాదారుల వద్ద వెళ్లి నోటీసులు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సూపర్‌బజార్‌ ప్రాంతంలో కొన్ని దుకాణా లను కూల్చివేశారని ఆరోపించారు. కాగా, తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే నిరూపించాలని కమిషనర్‌ పేర్కొన్నారు.

కమిషనర్‌పై సీపీఐ, బీఆర్‌ఎస్‌ ఆరోపణలు

సీపీఐ, బీఆర్‌ఎస్‌ నాయకులు మున్సిపల్‌ కార్యాల య ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెడ్దు పోకడలకు పోతున్నారని సీపీఐ జిల్లా కార్యరద్శి రామడుగు లక్ష్మణ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు డాక్టర్‌ రాజారమేశ్‌ ఆరోపించారు. అతడిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు.

కమిషనర్‌ కుర్చీపై ‘క్వో వారంటో ’

సమస్యలు పరిష్కరించడంలేదని..

సమావేశంలో వివిధ వార్డుల సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలు సమావేశం దృష్టికి తెచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక అనేక ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. పలుసార్లు కమిషనర్‌, అధికారులకు తెలిపినా పరిష్కారం కావటం లేదని మండిపడ్డారు.

క్యాతనపల్లి ము న్సిపల్‌ కమిషనర్‌గా మురళీకృష్ణ నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రి ట్‌ పిటిషన్‌ దాఖలైన ట్లు సమాచారం. ‘క్వో వారంటో’ కింద దాఖలైన ఈ పిటషన్‌లో కమిషనర్‌ పదవిలో కొనసాగేందుకు ఆయన అర్హ త, సర్వీస్‌ సీనియారిటీ, జోన్‌ కేటాయింపు తదిత ర అంశాలను పిటిషనర్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మురళీకృష్ణ రెవెన్యూ అధికారిగా ఉండగా, ప్రస్తుతం మున్సిపల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారని ఆయనకు సంబంధించి సర్వీస్‌ వివరాలు, సీనియారిటీ జాబితాలోని స్థానం తదితర అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించినట్లు సమాచా రం. ప్రస్తుత స్థాయిలో ఆయనకు మున్సిపల్‌ కమి షనర్‌ పదవి దక్కేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కొనసాగిస్తున్నారంటూ పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మురళీకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జోన్‌కు చెందిన అధికారిగా ఉండగా, కాళేశ్వరం జోన్‌లో మున్సిప ల్‌ కమిషనర్‌గా కొనసాగించటంపై పిటిషన్‌లో ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే, 2024 తర్వాత టీజీపీఎస్సీ ద్వారా, అంతర్గత పదోన్నతుల ద్వారా సుమారు 107మంది అధికారులు మున్సిపల్‌ కమిషనర్లుగా నియమితులైన నేపథ్యంలో ఇంకా మురళీకృష్ణను కొనసాగించటానికి గల కారణా లు కూడా పిటిషన్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఒక అధికారిని కొనసాగించేందుకు ఇతర అధి కారుల బదిలీలకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, గతంలో పనిచేసిన అతికొద్ది సమయంలోనే మురళీకృష్ణపై పలు ఆరోపణలు వచ్చినట్లు కూడా పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. అవినీతి ఆరోపణల కారణంగా ఏ ఒక్కచోట కూడా రెండేళ్లపాటు స్థిరంగా పనిచేసిన రికార్డు లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నట్లు సమాచారం. కాగా, మున్సిపల్‌ కమిషనర్‌ నియామకానికి సంబంధించిన అంశాలపై దాఖలైన ఈ పిటిషన్‌ నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణలో ఏమి నిర్ణయిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement