ప్రత్యేకావసరాల పిల్లలకు ఆటల పోటీలు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేకావసరాల పిల్లలకు ఆటల పోటీలు

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

మంచిర్యాలఅర్బన్‌: స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాల మైదానంలో ప్రత్యేకావసరాల పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించారు. 18మండలాల్లోని భవిత కేంద్రాల నుంచి చిన్నారులు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. రన్నింగ్‌, మ్యూజికల్‌ చైర్స్‌, బాల్‌త్రో, షాట్‌ఫుట్‌ తదితర క్రీడలను వారి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్వహించి విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, సెక్టోరల్‌ అధికారి కృష్ణమూర్తి, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ మహేశ్వర్‌రెడ్డి, హెచ్‌ఎం రమేశ్‌, పీడీలు రాజయ్య, శ్రీనివాస్‌, విజయ్‌చందర్‌, ఐఈఆర్పీలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement