మంచిర్యాలఅగ్రికల్చర్: సమాచార హక్కు చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ వడాల రాములు అన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సహ చట్టం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 7న రవీంద్రభారతిలో జరగనున్న కమిటీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో ఆర్టీఐ చట్టం ప్రాధాన్యతను వివరించారు. జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి ఆదేశాల మేరకు పోస్టర్ ఆవిష్కరించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు వంగల వివేకానంద, మార్క నవీన్, రాష్ట్ర కోకన్వీనర్ గడప కృష్ణ, జాయింట్ సెక్రటరీ దూడం శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లపురాజు ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పురెళ్ల శ్రీనివాస్, కోకన్వీనర్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ అజయ్, తదితరులు పాల్గొన్నారు.


