ఓటుహక్కు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

ఓటుహక్కు కాపాడాలి

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఓటుహక్కు కాపాడాలని, సర్‌లో అక్రమాలు, అవకతవకలను అరికట్టాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ ఏకపక్ష ధోరణి, అక్రమాలు అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు తూముల నరేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామగిరి బానేష్‌, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి

పాతమంచిర్యాల: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ను అరెస్టు చేసి పదవి నుంచి తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్‌ సేవా దళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నీలకంఠేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జ్ఞానేష్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. సభ్యులు వనజ, పద్మ, జంగు, రమేశ్‌, సాయిగౌడ్‌, సమ్మురాజయ్య, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement