● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, అట్రాసి టీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్, డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ రాములు, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరా మ్, ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి అట్రాసిటీ కేసులు, పరిష్కారం, బాధితులకు న్యాయం అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు మూత్రశాలలు, నీటి సరఫరా, ప్రహరీ వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ అట్రా సిటీ కేసుల నియంత్రణపై ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, కిరణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సంక్షేమ శాఖ అధికారులు దుర్గాప్రసాద్, రాజేశ్వరి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.


