పోలీస్‌, పీపీలు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌, పీపీలు సమన్వయంతో పనిచేయాలి

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాలక్రైం: నిందితులకు శిక్ష పడేలా పోలీస్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌లో సోమవారం మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాదితులకు న్యాయం జరగాలంటే అసలైన నేరస్తులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, పీపీలు నంది రవీందర్‌, నహీద ఫర్హిన్‌, అర్థ కుమార్‌, సీసీఆర్‌బీ సీఐ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

చట్టపరిధిలోనే సమస్య పరిష్కరించుకోవాలి

మంచిర్యాలక్రైం: ఎలాంటి సమస్య అయినా చట్టపరిధిలోనే పరిష్కరించుకోవాలని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌లో సోమవారం బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాప్యం చేయకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి సమస్య పరిష్కరించాలని సూచించారు. అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement