ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యం

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

మంచిర్యాలటౌన్‌: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎ మ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ని షాదీఖాన ఫంక్షన్‌హాల్‌లో సోమవారం డబుల్‌ బె డ్‌ రూం ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించారు. కార్యక్రమా నికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులకు న్యా యం జరిగేలా లక్కీ డ్రా ద్వారా ఎంపిక ప్రక్రియను చేపట్టామన్నారు. అనంతరం అధికారులు లక్కీడ్రా ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు.

344 ఇళ్లకు లక్కీడ్రా

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో మిగిలిన 344 ఇళ్లకు 17,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీలకు 60, ఎస్టీలకు 21, మైనార్టీలకు 42, బీసీ, ఓసీలకు 221 ఇళ్లకు లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో హమాలివాడ రోడ్డు వెడల్పులో ఇళ్లను కోల్పోయిన ఐదు కుటుంబాలకు ఇళ్లు కేటాయించగా, మరో వంద మంది పేర్లను బఫర్‌లో తీసి ఉంచారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ అన్వేస్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజు, తహసీల్దార్‌ రఫతుల్లా హుస్సేన్‌, హౌజింగ్‌ పీడీ బన్సీలాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement