మంచిర్యాలటౌన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి ఎన్‌ఐడీజేఏఎం(నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్), సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సాంబమూర్తి, ఈగ మారయ్య తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అండర్–14, అండర్–16 విభాగంలో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్–10, అండర్–12, అండర్–14 విభాగంలో నిర్వహించనున్న జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఎంపికై న వారు అక్టోబర్ 11న ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు.


