తాండూర్: మండలంలోని అచ్చులాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం అండర్–14 బాలికల జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి 150 మంది బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన 16 మందిని జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
ఎంపికై న బాలికలు వీరే..
ఎంపికై న వారిలో కుందన, బి.హర్షిత, సీహెచ్.సాహితి, మౌనిక, బి.రమాదేవి, సుదిషా, ఎం.శాన్విక, రిషిక, ఓ.సన, ఎం.రమాదేవి, ఎం.ప్రవళిక, బిందు, రిత్విక, శ్రీహర్ష, అక్షిత, అద్వైత ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.ఉమాదేవి, ఎంఈవో శ్రీనివాస్, ఎస్‌జీఎఫ్ సెక్రెటరి ఎండీ యాకూబ్, తదితరులు పాల్గొన్నారు.


