మందమర్రిరూరల్: సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 55వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పరిరక్షణ కోసం ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ‘సింగరేణి బకాయిలు బీజేపీ లడాయి’ పేరిట చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంద ర్భంగా వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సంజీవరావు, డీవీ దీక్షితులు, దుర్గరాజ్, జనార్దన్, శ్రీనివాస్, మహేశ్, సుధాకర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి: సింగరేణి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.55 వేల కోట్లు వెంట నే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న నిర్వహించనున్న ధర్నాకు కార్మికులు హాజరై విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వరగౌడ్ కోరారు. సోమవా రం బెల్లంపల్లిలో ధర్నా వాల్ పోస్టర్లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవితో కలిసి విడుదల చేశా రు. బీజేపీ నాయకులు వెంకటకృష్ణ, రాచర్ల సంతోష్, దార కల్యాణి, సంపత్, రాజ్‌కుమార్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


