మళ్లీ టీచర్ల బదిలీలలు..! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ టీచర్ల బదిలీలలు..!

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

● రెండో విడతలో 61 మంది సర్దుబాటు ● వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో తప్పుల మీద తప్పులు

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్యకు అనుగుణంగా మిగులు (సర్‌ప్లస్‌) ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోటకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాత్కాలిక ప్రాతి పదికన విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు అమలులో ఉండేలా కేటాయించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య పరిశీలించిన అనంతరం 61 మంది టీచర్లను సర్దుబాటు కింద డిప్యూట్‌ చేశారు. ఉత్తర్వులు పొందిన వారు పాఠశాల కాంప్లెక్స్‌ హెచ్‌ఎం వద్ద వెంటనే రిపోర్ట్‌ చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

తప్పుల మీద తప్పులు..

రెండోవిడత టీచర్ల సర్దుబాటు ప్రక్రియ గందరగో ళంగా మారింది. అవసరం లేకపోయినా కొందరికి డిప్యూటేషన్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. త క్కువ మంది ఉండాల్సిన చోట నలుగురు పనిచేస్తున్నారనే నెపంతో ఇష్టారీతిన బదిలీలు చేపట్టారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లను బదిలీ చే యడం వంటి నిర్ణయాల వల్ల విద్యాశాఖలో అసలేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మొదటి విడతలో జరిగిన పొరపాట్లను ఇన్‌చార్జి డీఈవో చంద్రయ్య దిద్దుబాటు చర్యలతో సరిచేశారు. ఇంతలోనే రెండో విడతలో పొరపాట్లు జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement