బెల్లంపల్లి: ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. మంగళవారం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్ మాట్లాడారు. తన గెలుపుకోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా వలసవాదులకు ప్రాధాన్యం ఇస్తున్నాడన్నారు. తమ విధానం మార్చుకోకపోతే రాబోయే కా లంలో పార్టీకి చాలా నష్టం కలుగుతుందన్నా రు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యే అందరి ని కలుపుకొని పనిచేయాలని, లేదంటే అధి ష్టానానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మునిమంద రమేశ్, నయీం, రొడ్డ శ్యామ్, ఎం.డీ గౌస్, జక్కుల శ్రీధర్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చిప్ప మనోహర్, మాజీ కౌన్సిలర్లు బొడ్డు నారాయణ, కటకం సతీష్, సిలివేరి సత్యనారాయణ, సూరం బానేష్, మేకల శ్రీనివాస్, మత్తమారి సత్తిబాబు, మంగమూర్తి, దాసరి సంజీవ్, గడ్డం అశోక్, జిలకర వాసు, తదితరులు పాల్గొన్నారు.


