వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

మంచిర్యాలక్రైం: పోలీస్‌ వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ వాహనాలను మంగళవారం సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల కండీషన్‌ బాగుంటేనే ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఘటనా స్థలానికి నిర్ణీత సమయంలో చేరుకుంటామన్నారు. డ్రైవర్లు రోజువారీగా వాటిని పరీక్షించాలన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ

సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నా రు. కమిషనరేట్‌ ఆవరణలో మంగళవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్‌ అధికా రులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రుల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవా లన్నారు. అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, డీసీపీలు భాస్కర్‌, రాంరెడ్డి, ఏసీపీలు ప్రకాష్‌, కృష్ణ, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, రవీందర్‌, నాగేంద్రగౌడ్‌, శ్రీనివాస్‌, సీఐ లు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement