చెన్నూర్: రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లతో పుష్కర ఘా ట్ల పనులు జరుగుతున్నాయని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నా రు. కాళేశ్వరం, బాసర, ధర్మపురి, భద్రాచలం, చె న్నూర్ అంబా ఆగస్తేశ్వరాలయం, కోటిలింగాల ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మంగళవారం స్థానిక గోదా వరి ఒడ్డున పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు. చెన్నూర్‌కు రూ.70 కోట్లు కేటాయించామని, సుమారు రూ.8 కోట్లతో పుష్కర ఘాట్లు, స్నానపు గదులు, రహదా రులు, మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. చెన్నూర్ పెద్ద చెరువును రూ.17 కోట్ల నిధులలో అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శివారం మొసళ్ల కేంద్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. రూ. 30 కోట్ల ని ధులతో అమృత్ 2.0 ట్యాంక్ నిర్మిస్తున్నామన్నా రు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, నీటి పా రుదల శాఖ ఈఈ విష్ణు, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, కమిషనర్ మారుతి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
చెన్నూర్: గణనాధుని ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు గణేశ్ మండళ్లను సందర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అజీమొద్దీన్, అంబటి శంకర్, నాయకులు పెద్దింటి శ్రీనివాస్, తనుగుల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.


