తీవ్రంగా గాయపడిన మమత
మంచిర్యాల జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆమె ముక్కు కొరికిన సంఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన ఎనగందుల మణిచందర్‌కు కోటపల్లికి చెందిన మమతతో తొమ్మిదేళ్ల క్రితం వివాహామైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
రెండ్రోజుల క్రితం అదనపు కట్నం కోసం గొడవ జరగడంతో మ మత కోటపల్లిలోని పుట్టింటికి వచి్చంది. మణిచందర్ ఆదివారం అత్తగారింటికి వెళ్లి మమతపై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో మామ నారాయణ అడ్డుకోగా అతడిని కొట్టి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం భార్య మమతపై పడి బలంగా ముక్కును కొరకగా తీవ్ర రక్తస్రావంతో పడిపోయింది. అంబులెన్స్‌లో చెన్నూర్, మంచిర్యాలకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు. మమత కుటుంబీకులు కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి: నా పేరు నమ్రత.. పరేడ్ గ్రౌండ్స్ వద్ద కలుద్దామా!


