భూ రికార్డుల నవీకరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ రికార్డుల నవీకరణ వేగవంతం చేయాలి

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో భూ రికార్డుల నవీకరణ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, జీపీవో, ల్యాండ్‌ సర్వే అధికారులతో నెన్నెల మండలం చిన్నవెంకటపూర్‌, పుప్పాలవానిపేట గ్రామాల్లో భూ రికార్డుల నవీకరణపై సమీక్షించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ భూ రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌ పనులను సమన్వయంతో పూర్తి చేయాలని తెలిపారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భూ రికార్డుల కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement