ఈసారి మొక్కలు నాటడంతోపాటు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండడంతో వన మహోత్సవం ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే 36 లక్షల మొక్కలు నాటడం జరిగింది. గాంధారి వనం, అటవీ పరిధిలో ఖాళీ ప్రదేశాన్ని చదును చేసి మొక్కలు నాటడం జరుగుతోంది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంటుంది.
– రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అటవీ శాఖ అధికారి, మంచిర్యాల(08ఎంసీఎల్30)


