బెల్లంపల్లి బల్దియాలో ఇలా..
అనుమతి లేని నిర్మాణాలు 55
జారీ చేసిన నోటీసులు 55
ఇప్పటివరకు కూల్చిన ఇళ్లు 2
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్ర మ, అనుమతి లేని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం పట్టా భూమి కలిగి, అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా కొందరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మున్సిప ల్ ప్రజాప్రతినిధులతో బేరసారాలు చేసుకుని నిర్మాణాలు చేపడుతుండగా అధికారులు నిలువరించడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.
చేతులు మారుతున్న భూములు
సింగరేణి రిటైర్డ్ కార్మికులు, నిరుపేదలు, దినసరి కూలీలు రెక్కలు ముక్కలు చేసుకుని కూడగట్టిన కొ ద్దిపాటి సొమ్ముతో ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు నానా యాతన పడుతున్నారు. బడా వ్యాపారులు మాత్రం యథేచ్ఛగా బహుళ (జీప్లస్‌టు) అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం సర్వసాధారణమై పోయింది. అవసరాల రీత్యా నిరుపేదలు అమ్ముకున్న ఇళ్లు, ఇంటి స్థలాలతోపాటు ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా, నిర్భయంగా అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మి స్తున్నారు. దీనిని అధికారులు ‘మామూలు’గా తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరో పణలున్నాయి. నిరుపేదలు మాత్రం ఎక్కడైనా ఇంటి నిర్మాణం చేపడితే వెంటనే సిబ్బందిని పంపించి సామగ్రి ధ్వంసం చేసి పనిముట్లు పట్టుకెళ్తున్నారు.
ప్రభుత్వ భూమిలో శాశ్వత కట్టడాలు
మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 90శాతం ప్రభుత్వ భూములున్నాయి. బుధాకలాన్ శివారు సర్వే నంబ ర్ 170లో ప్రభుత్వ భూములుండగా, కాల్ టెక్స్, రైల్వేస్టేషన్ ఏరియాల్లో 10శాతం పట్టా భూములు న్నాయి. మెజార్టీ నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో చే పడుతుండడం గమనార్హం. బొగ్గు గనులు మూసివేతకు గురైన తర్వాత కార్మిక వాడల్లోని కంపెనీ అ ధీనంలోగల భూభాగంతోపాటు క్వార్టర్లను ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. దీంతో గత ప్రభుత్వం వేర్వేరుగా విడుదల చేసిన జీవో 58, 59, 76 ప్రకా రం నివేశనదారులకు ఇళ్ల పట్టాలు అందజేసింది. ఇంకా అనేకమందికి పట్టాలు జారీ కావాల్సి ఉంది. పట్టాలు రావడంతో కొందరు ముందస్తు అనుమతి తీసుకుని ఇళ్లు నిర్మిస్తుండగా వార్డు కౌన్సిలర్ల మధ్యవర్తిత్వంతో కార్యాన్ని పూర్తి చేస్తున్నారు.


