మంచిర్యాలక్రైం: టీజీఈఏజేసీ పిలుపు మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట అటవీశాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన తె లిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అటవీశాఖ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు, సెంట్రల్ యూని యన్ కో చైర్మన్ పొన్నం మల్లయ్య హాజరై మాట్లాడారు. 51శాతం ఫిట్‌మెంట్‌తో రెండో వేతన సవరణను వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలను ప్రకటించాలని వి జ్ఞప్తి చేశారు. ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన తెలుపనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధానిలో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.


