ఇక ఇడ్లీ.. పూరి.. బోండా | - | Sakshi
Sakshi News home page

ఇక ఇడ్లీ.. పూరి.. బోండా

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

● పాఠశాలలు, కాలేజీల్లో అల్పాహారం ● పూర్తయిన బ్రేక్‌ఫాస్ట్‌ ట్రయల్‌ రన్‌ ● ఈనెల 31న లాంఛనంగా షురూ

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు శనివారం చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్‌ ట్ర యల్‌రన్‌ విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఫౌండేషన్‌ సహకారంతో అత్యాధునిక యంత్రాలతో తయారు చేసిన అ ల్పాహారాన్ని పాఠశాలలకు సరఫరా చేశారు. నిర్దేశించిన సమయానికి ముందే ఇడ్లీ, పూరి, బోండాలను చేరవేసి విద్యార్థులకు అందించారు.

సంబురపడ్డ విద్యార్థులు

జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో 30పాఠశాలలుండగా 4,300మంది విద్యార్థులు, ఒక ప్రభు త్వ జూనియర్‌ కళాశాల ఉండగా 850 స్టూడెంట్లున్నారు. ముందురోజు సెలవు కావటంతో తక్కువ సంఖ్య విద్యార్థులు రాగా అల్పాహారాన్ని అందించారు. ఉదయం 5.30నుంచి రెండు రూట్ల్‌గా విభజించి వాహనాల ద్వారా ఉపాహారం 7.30 గంటల వరకు సరఫరా చేశారు. విద్యార్థులకు ఇడ్లీతో పాటు గుమగుమలాడే సాంబారు, కమ్మని పూరీ, ఆలు కుర్మా, బోండా, చెట్నీ అందించారు. ఉద యం వేడివేడిగా కడుపు నిండా అల్పాహారం అందడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

రేపు లాంఛనంగా ప్రారంభం

శనివారం ట్రయల్‌రన్‌ సక్సెస్‌ కాగా సోమవారం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 31న మంచిర్యాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించనుండగా.. రెండు, మూడు రోజుల్లో లక్సెట్టిపేట, హాజీపూర్‌, నస్పూర్‌ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. వారంలో నాలు గు మండలాల చొప్పున సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని విస్తరించనున్నారు.

పథకం అమలు ఇలా..

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 17మండలాల్లో 691 పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు మంచిర్యాలలో ఏర్పాటు చేసి న హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ద్వారా అల్పాహారం అందించనున్నారు. జిల్లాలో 18 మండలాల్లో 14 మండలాలకే మంచిర్యాల సెంట్రలైడ్జ్‌ వంటశాల నుంచి సరఫరా చేయనున్నారు. నెన్నెల, భీ మిని, కన్నెపల్లి మండలాలకు కుమురంభీం ఆసిఫా బాద్‌ జిల్లా నుంచి, జన్నారం మండలంలోని పాఠశాలలకు జగిత్యా ల నుంచి సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. పె ద్దపల్లి జిల్లాలోని అంతర్గాం, పాలకుర్తి, రామగుండం మండలాల సర్కారు బడులు, కా లేజీలకు మాత్రం ఉపాహారం అందిస్తూ.. బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని విడతలు వారీగా విస్తరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement