మంచిర్యాలరూరల్(హాజీపూర్): సవాళ్లను ధై ర్యంగా ఎదుర్కొంటూ లక్ష్యాలు చేరుకోవాలని కేంద్రీయ విద్యాలయ (కేవీ) చైర్మన్, కలెక్టర్ కుమార్‌దీపక్ సూచించారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గుడిపేటలోగల కేవీలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన క్రీడా దినోత్సవ వేడుకల్లో మాట్లాడా రు. కేవీకి సొంత భవనం సమకూరడంతో వి ద్యార్థుల సంఖ్య రెట్టింపైందని, సుమారు 680 మంది విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడు తూ.. కేవీలో నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాలు రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నా యకులకు అధికారికంగా బాధ్యతలు అప్పగించే వేడుక నిర్వహించారు. నూతనంగా ఎన్నికై న బాధ్యులకు ఎమ్మెల్యే, కలెక్టర్, మేయర్ మధూకర్, కార్పొరేటర్లు రాజన్న, కమల, శ్రీనివాస్, కేవీ ప్రిన్సిపల్ లోకేశ్‌యాదవ్ చేతుల మీదుగా బ్యాడ్జీలు అందజేసి బాధ్యతలు అప్పగించారు.


