మంచిర్యాలటౌన్: మంచిర్యాలలోని అంబులెన్స్ సిబ్బంది ఆగడాలను అరికట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఏసీపీ ప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల నస్పూరులోని ఏఎస్‌ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన ఎర్ర వెంకటేశ్(26) బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలు కాగా, ప్రైవేటు అంబులెన్సుల సిబ్బంది చెప్పిన ఆసుపత్రికి కాకుండా, మరో ఆసుపత్రికి తీసుకెళ్లి సమయం వృథా చేయడంతో మృతిచెందాడని తెలిపారు. గతంలోనూ ఇదే విధంగా పలువురిని ఇబ్బందులకు గురిచేయడం, రోగులు, వారి కుటుంబ సభ్యులతో ఇష్టారీతిన ప్రవర్తించడం వంటివి చేయడంపై ఫిర్యాదులు వస్తున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్డీ సభ్యులు సీహెచ్ సంతోష్, శ్రీధర్‌బాబు, ప్రవీణ్, టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్, ఐఎంఏ సభ్యులు డాక్టర్ రవిప్రసాద్, డాక్టర్ రాకేష్, డాక్టర్ రవిప్రసాద్, డాక్టర్ ఎం.అనిల్‌కుమార్, డాక్టర్ సంతోష్, డాక్టర్ బాలాజి, వైద్యులు పాల్గొన్నారు.


