బకాయి మిల్లులపై చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

బకాయి మిల్లులపై చర్యలు తప్పవు

Aug 19 2026 1:00 AM | Updated on Aug 19 2026 1:00 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లలో రైస్‌మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో బి సెక్షన్‌ పర్యవేక్షకులు మధుసూదన్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, మేనేజర్‌ శ్రీకళతో కలిసి తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం వసూలు చేసే అంశంపై సమీక్షించా రు. రెవెన్యూ రికవరి యాక్ట్‌లో నిబంధనలు, బకాయిల వసూళ్లకు అనుసరించాల్సిన విధి విధానాలు, మిల్లుల వారీగా పెండింగ్‌ బకా యిల మొత్తాలు, కోర్టు కేసులపై అధికారులతో చర్చించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలో 23 రైస్‌మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ అమలు చేశామని, బకాయిలను గుర్తించి నిబంధనల ప్రకారం వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు.

మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement