వీఐపీల భద్రతపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

వీఐపీల భద్రతపై అప్రమత్తత అవసరం

Aug 19 2026 1:00 AM | Updated on Aug 19 2026 1:00 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాలక్రైం: వీఐపీల భద్రతపై పీఎస్‌ఓలు(గన్‌మెన్‌) అత్యంత అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్‌ ప్రాంగణంలో వీఐపీ అధికారులకు భద్రత విధులు నిర్వహిస్తున్న పీఎస్‌ఓలకు ఒక్కరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలతో నేరుగా సంబంధం కలిగిన పీఎస్‌ఓలు అవినీతి, అక్రమ ప్రయోజనాలకు దూరంగా ఉంండాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలకు దూరంగా ఉండాలని అన్నారు. రోజువారీగా కసరత్తులు, విన్యాసాలు, సాహసాలు సాధన చేయాలని పేర్కొన్నారు. సమాచార మార్పిడి, సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, సమాచార గోప్యత, వృతి నైపుణ్యం తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ ఏసీపీలు ప్రతాప్‌, రమేష్‌, మల్లేశం సీసీ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement