నస్పూర్: న్యాయ సహాయం కోసం భరోసా కేంద్రానికి వచ్చే బాధితులకు సత్వర న్యా యం అందించాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన సీసీసీలోని భరోసా కేంద్రాన్ని సందర్శించా రు. బాధితులకు అందుతున్న సేవలను పరి శీలించి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బాధితులకు కౌన్సెలింగ్, న్యాయ సహాయం, మానసిక పరామర్శ, పునరావాసం తదితర సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సత్యనారాయణ, రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్సై హైమ పాల్గొన్నారు.


