మంచిర్యాలఅర్బన్: జిల్లాలో యంగ్ ఇండియా ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద ఎంపికై న తాండూర్, మంచిర్యాల, బెల్లంపల్లి కేజీబీవీల్లో ఆరోతరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవే శ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 264 మందికి గాను 192 మంది బాలికలు హాజరుకాగా 72 మంది గైర్హాజరయ్యారు. మంచిర్యాల కేజీబీవీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 109 మందికిగాను 72 మంది, బెల్లంపల్లిలో 103 మందికి గాను 81 మంది, తాండూర్‌లో 52 మందికి గాను 39 మంది విద్యార్థినులు హా జరయ్యారు. విద్యార్థినుల కోసం ఆయా రూట్ల లో రవాణా సౌకర్యం కల్పించారు. ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ నుంచి సీఆర్టీలు, సిబ్బందిని నియమించారు. మంచిర్యాల కేజీబీవీ లో ఏ ర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్ట ర్, డీఈవో చంద్రయ్య తనిఖీ చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్ష కేంద్రాలకు సెక్టోరల్ అధికారి విజయలక్ష్మి, మండల విద్యాధికా రులు మాళవీదేవి, పోచయ్యతో జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ మల్లేశం ప్రశ్నాపత్రాలను తరలించారు.


