‘మధ్యాహ్న’ పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘మధ్యాహ్న’ పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

శ్రీరాంపూర్‌: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వమే నిర్వహించాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి కృష్ణమాచారి డిమాండ్‌ చేశారు. ఆదివారం న స్పూర్‌ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మా ట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని కోరారు. 60 ఏళ్లకు చేరినవారిని తొలగించడం సరికాదని పేర్కొన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.2లక్షల చెల్లించాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా 20 మంది కార్మి కులతో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement