ఎస్టీపీపీలో వైద్యశిబిరం | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీలో వైద్యశిబిరం

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

జైపూర్‌: జైపూర్‌ మండల కేంద్రంలో గల సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటులో ఆదివారం సింగరేణి ఉ ద్యోగులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పిల్లల ఆరోగ్యం, చర్మవ్యాధుల నివారణకు ఉచితంగా పిల్లల వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం నర్సింహారావుతో కలిసి ప్రారంభించారు. వైద్యశిబిరంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ రఘువంశీ, చర్మవ్యాధుల నిపుణురాలు డాక్టర్‌ రోజిత 50మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చర్మవ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు. ఉద్యోగుల పిల్లల ఆరోగ్య సౌకర్యార్థం ప్రత్యేకంగా వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు, తద్వారా పిల్లల ఆరోగ్యపరీక్షలు చేసి అవసరమైన మందులు అందించినట్లు ఈడీ చిరంజీవి తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీపీపీ డిస్పెన్సరీ డాక్టర్‌ జానకి, రిటైర్డ్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, ఇతర ఉద్యోగులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement