జిల్లాలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశాం. చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయొద్దు. ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూడాలి. పండ్లు, కూరగాయలు శుభ్రమైన నీటితో కడిగి వండుకోవాలి. స్వచ్ఛమైన నీటినే తాగాలి. చేతి గోర్లను చిన్నగా కత్తిరించుకోవాలి. మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లేటప్పుడు కాళ్లకు తప్పనిసరిగా చెప్పులు లేదా బూట్లు ధరించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నారులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో


