మంచిర్యాలటౌన్: నులిపురుగుల నిర్మూలనకు ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్స వం రోజే 1–19 ఏళ్ల వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయ డం, చెప్పులు లేకుండా తిరగడం.. ఆడుకోవ డం, భోజనం చేసే ముందు, చేసిన త ర్వాత చేతులు శు భ్రం చేసుకోకపోవడంతో తరచూ పిల్ల లు కడపునొప్పి, విరో చనాల బారిన పడుతుంటారు. చిన్నారుల పొట్ట లో ఏళ్ల తరబడి తిష్టవేసి పోషకాలను హరిస్తూ ఆరోగ్యాన్ని హాని కలిగించే నులి పురుగులతో జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ముందు జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రా ణాంతకంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. నులి పురుగుల నివారణకు ఏటా జూలై 13ను జా తీయ నులి పురుగుల నిర్మూలన దినంగా నిర్వహి స్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నులి పురుగుల నివారణకు 1–19 ఏళ్లవారికి మాత్రలు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోని వారికి మాప్‌అప్ డేగా పరిగణించి ఈ నెల 20వ తేదీన మాత్రలు వేయనున్నారు.
నులి పురుగుల వృద్ధి ఇలా..
పిల్లలు సాధారణంగా మూడు రకాల క్రిముల బా రిన పడతారు. వాటిలో ఏలిక పాములు, నులి పురుగులు, కొంకి పురుగులు ప్రధానమైనవి. నులిపురుగులు కడుపులోని పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులు. పిల్లలు ఆరుబయ ట వట్టి కాళ్లతో ఆడుకున్నప్పుడు, చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని భుజించినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేసినప్పుడు, అపరిశుభ్ర పరిసరాల్లో చిన్నారుల చెంతకు చేరతాయి. నులిపురుగులు కలిగిన చిన్నారులు, వాటి గుడ్లు కలిగిన మలంతో నేలను కలుషితం చేస్తారు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. చిన్నారులు ఆరుబయట మట్టి ముట్టడం, లేదా ఈ నులిపురుగుల గుడ్లు చేరిన ఆహారాన్ని తీసుకోవడంతో వారి కడుపులోకి వెళ్లి అక్కడ వృద్ధి చెంది తిష్టవేసి ఇబ్బంది పెడతాయి.
ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తాయంటే..
నులిపురుగులు కలిగిన ఆహారం చిన్నారులు తిన్నప్పుడు అది పేగుల్లోకి చేరుతుంది. రక్తంలోకి చేరా ల్సిన పోషకాలను నులిపురుగులు పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచి వివిధ రోగాల బారిన పడతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం సంభవిస్తుంది. దీంతో పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రక్త హీనత, పోషకాహార లోపం బారిన పడతారు. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, అతి సారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటి పలు లక్షణాలు కనిపిస్తాయి.
ఎవరెవరికి.. ఎంత డోసు..
జిల్లాలోని 1–19 ఏళ్లవారు 1,81,113 మంది ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించి సరిపడా మాత్రలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేశారు. ఆల్బెండజోల్ మాత్రను మధ్యాహ్న భోజనం తర్వాత అందించనున్నారు. 1–2 ఏళ్ల పిల్లలకు అరమాత్ర, 2–3 ఏళ్ల వారికి ఒక మాత్ర పొడి చేసి నీటితో మింగించాలి. 3–19 ఏళ్ల వారు ఒక మాత్ర చప్పరించి మింగాలి. ఇది నేరుగా మింగే మాత్ర కాదు. నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది.


