హాజీపూర్ మండలం ధర్మారం ఊర చెరువులో ఇటీవల మత్స్యకారుల వలకు మొసలి చిక్కింది. దీంతో భయాందోళన చెందిన మత్స్యకారులు చెరువులోనే వదిలి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అనిత, హాజీపూర్ డెప్యూటీ రేంజ్ అధికారి సునీత, హాజీపూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ శాంతిరేఖ, టీకానపల్లి ఎఫ్‌బీవో ఫరీదా ఆధ్వర్యంలో చెరువులో నుంచి మొసలిని బయటకు తీసి గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి వదిలిపెట్టారు.
– మంచిర్యాలరూరల్(హాజీపూర్)


