20 క్వింటాళ్ల పత్తి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

20 క్వింటాళ్ల పత్తి దగ్ధం

Mar 5 2026 7:25 AM | Updated on Mar 5 2026 7:25 AM

మందమర్రిరూరల్‌: మందమర్రి మండలంలోని పొన్నారంలో పెంచాల బాపుకు చెందిన సుమారు ఇరవై క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలకు 12 ఎకరాల చేనులో ఏరిన సుమారు 45 క్వింటాళ్ల పత్తిని ఇంటివద్ద నిల్వ చేశారు. బుధవారం తెల్లవారు జామున వాసన రా వడంతో బయటకి వచ్చి చూడగా పత్తి తగలపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల వారిని నిద్రలేపడంతో మంటలు ఆర్పివేశారు. పత్తి కుప్ప వద్ద సగం వరకు పెట్రోల్‌ ఉన్న చిన్న థమ్సప్‌ బాటి ల్‌ లభించినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే పెట్రోల్‌ పోసి నిప్పంటించారని అనుమానం వ్యక్తం చే శారు. సర్పంచ్‌ పెంచాల మధు సమాచారంతో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రామకృష్ణాపూ ర్‌ పోలీస్‌స్టేషన్‌లో, తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

అమృత్‌ 2.0 పైపులు..

చెన్నూర్‌: పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గల అమృత్‌ 2.0 పైపులు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. సీఐ బన్సీలాల్‌ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో 400 పైపులు కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.20 లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు. కాగా పక్కనే ఇంటర్‌ పరీక్ష కేంద్రం ఉంది. పరీక్ష అయిన తర్వాత ఘటన చోటు చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే పొగతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు

బోథ్‌: సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన మండల కేంద్రానికి చెందిన యువకుడిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ గురుస్వామి తెలిపారు. రెండు రోజుల క్రితం భీంపూర్‌ మండలంలో జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ధ్వంసం ఘటనపై, బోథ్‌కు చెందిన జాదవ్‌ వినోద్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇరు వర్గాల మధ్య గొడవలకు దారి తీసేలా పోస్టు చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement