వేలాల జాతరకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వేలాల జాతరకు ఏర్పాట్లు

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

వేలాల జాతరకు ఏర్పాట్లు

వేలాల జాతరకు ఏర్పాట్లు

జైపూర్‌: ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధిగాంచిన వేలాల మల్లన్న స్వామి ఆలయంలో జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే జాతరకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలపై దృష్టి సారించారు. బుధవారం ఎస్టీపీపీ జీఎంలు నర్సింలు, మదన్‌మోహన్‌, తహసీల్దార్‌ వనజారెడ్డి, ఎస్సై గుణశేఖర్‌తోపాటు పలు శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. వేలాదిగా భక్తులు జాతరకు తరలి రానున్న క్రమంలో గట్టు మల్ల న్న క్షేత్రంపై భక్తులు తాగునీరు, గట్టు కింద భక్తులకు గోదావరి నదిలో పుణ్యస్నానాలు, వాహనాల పార్కింగ్‌, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్పంచ్‌ డేగ స్వప్న, ఎంపీవో శ్రీపతి బాపురావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ విద్యాసాగర్‌, ఎస్టీపీపీ పర్సనల్‌ డీజీఎం కిరణ్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement